allu arjun: అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడట

  • ఏప్రిల్ 8వ తేదీన బన్నీ బర్త్ డే 
  • ఆ రోజునే కొత్త సినిమా లాంచ్ 
  • 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్  

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు. ఆ రోజున ఈ సినిమాను లాంచ్ చేసి .. రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ రెండు పాత్రల కోసం కాస్త బరువు తగ్గవలసి ఉంటుందని త్రివిక్రమ్ చెప్పడంతో, కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అదే పనిలో వున్నాడని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ సినిమాలో, కథానాయికలుగా పూజా హెగ్డే .. కేథరిన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News