shrwanand: శర్వానంద్ కూడా రంగంలోకి దిగుతున్నాడు

  • గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న శర్వానంద్ 
  • నాయికలుగా కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ 
  • మే 31వ తేదీన విడుదల చేసే ఆలోచన    

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో, కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా అలరించనున్నారు.

చాలామంది హీరోలు వేసవి సెలవుల్లో తమ సినిమాలు థియేటర్లకు వచ్చేలా చూసుకుంటున్నారు. దాంతో శర్వానంద్ సినిమా ఈ వేసవికి వస్తుందా లేదా అనే ఆలోచనలో అభిమానులు వున్నారు. శర్వానంద్ వాళ్లు కూడా వేసవి సెలవులను వృథా చేసుకోకూడదనే ఉద్దేశంతో ఉన్నారట. ఈ వేసవి సెలవులకు ప్రేక్షకులను పలకరించవలసిందే అనే పట్టుదలతో మే 31వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తన కెరియర్లో ఇదో డిఫరెంట్ మూవీ అవుతుందనే నమ్మకంతో శర్వానంద్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

More Telugu News