India: ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో మరో భారతీయ పదం

  • చెడ్డీస్ కు డిక్షనరీలో చోటు
  • కొత్తగా 650 పదాలకు స్థానం
  • నూతన వెర్షన్ రూపకల్పన

ప్రపంచంలో ఆక్స్ ఫర్డ్ నిఘంటువుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక భాషల నుంచి విస్తృతంగా వాడుకలో ఉన్న పదాలను కూడా ఆంగ్ల భాషలో ఇమిడ్చే ప్రయత్నాలు చేస్తుంటుంది ఆక్స్ ఫర్డ్. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో భారతీయ పదాలు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి.

తాజాగా, భారతీయులు లోదుస్తులు అనే అర్థం వచ్చేలా పలికే 'చడ్డీస్' అనే పదాన్ని కూడా ఆక్స్ ఫర్డ్ నిఘంటువులోకి ఎక్కించారు. ఈ డిక్షనరీలో చడ్డీస్ అనే పదానికి షార్ట్ ట్రౌజర్స్, అండర్ ప్యాంట్స్, షార్ట్స్ అనే అర్థాలు కనిపిస్తాయి. ఈ పదం అప్పటి బ్రిటీష్ పాలకులకు కూడా సుపరిచితమే. భారత్ లో బ్రిటీష్ పాలన కొనసాగిన కాలంలో వారి అధికారిక గెజిట్లు, ఇతర ప్రచురణల్లో చడ్డీస్ పదాన్ని ఉపయోగించేవాళ్లు. కాగా, తాజా వెర్షన్ లో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 650 కొత్త పదాలకు స్థానం కల్పించారు.

More Telugu News