Andhra Pradesh: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీతో వైఎస్ సునీతారెడ్డి భేటీ!

  • వైఎస్ వివేకా కేసును తప్పుదారి పట్టిస్తున్నారు
  • సీఎం వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయి
  • ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిగేలా చూడండి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. భర్త రాజశేఖరరెడ్డితో కలిసి ద్వివేదీని కలుసుకున్న సునీత.. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు సిట్ అధికారుల విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని విమర్శించారు.

ఈ నేపథ్యంలో సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని సునీత గోపాలకృష్ణ ద్వివేదీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తన తండ్రి హత్య విషయంలో జరుగుతున్న రాద్దాంతాన్ని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ లను ద్వివేదీకి అందజేసినట్లు పేర్కొన్నారు.

More Telugu News