talent show: కొత్త టాలెంట్ కు ఆహ్వానం పలుకుతున్న ‘ఏక్ దమ్ జక్కాస్’ కామెడీ షో!

  • నాంపల్లి లలితకళా తోరణంలో సెలక్షన్స్
  • ఈ నెల 23 నుంచి 25 వరకూ ఎంపిక ప్రక్రియ
  • ఏ వయసు వారైనా హాజరు కావొచ్చు

మరో కామెడీ షో రూపకల్పనకు రంగం సిద్ధమయింది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఏక్ దమ్ జక్కా స్-దిమ్మతిరిగే కామెడీ షో’ కోసం ఆడిషన్లు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని లలితకళా తోరణంలో ఈ సెలక్షన్స్ జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఎంపిక ప్రక్రియ సాగుతుందన్నారు.

ఆసక్తి ఉన్నవారు సోలోగా లేదా జతగా లేదా తమ గ్రూపుతో కలిసి హాజరు కావొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వయసుతో సంబంధం లేదనీ, ఏ వయసువారైనా తమ టాలెంట్ ను నిరూపించుకోవచ్చని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు మొబైల్ నంబర్ 7396817623 ను సంప్రదించాలని కోరారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని నిర్వాహకులు మరోసారి విజ్ఞప్తి చేశారు.

More Telugu News