Varun Tej: బాబాయ్ పార్టీలో తన తండ్రి చేరడంపై స్పందించిన వరుణ్ తేజ్!

  • జనసేనలో చేరిన నాగబాబు
  • చాలా సంతోషకరం
  • ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన వరుణ్ తేజ్

నిన్న జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీలో కొణిదెల నాగబాబు చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు నరసాపురం నుంచి పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా టికెట్ ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన తండ్రి జనసేనలో చేరికపై నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "మా నాన్న జనసేనలో చేరి, బాబాయ్ తో కలిసి పోటీ చేయనుండటం నాకు చాలా సంతోషకరం" అని వ్యాఖ్యానించారు.

More Telugu News