karthikeya: కార్తికేయ 'హిప్పీ' నుంచి టీజర్ వచ్చేసింది

  • 'ఆర్ ఎక్స్ 100'తో క్రేజ్
  • తాజా చిత్రంగా 'హిప్పీ'
  • వేసవిలో విడుదల  

'ఆర్ ఎక్స్ 100' తరువాత హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యూత్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'హిప్పీ' చిత్రం రూపొందుతోంది. కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కార్తికేయ సరసన దిగాంగన కథానాయికగా కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ సినిమా 'ఆర్ ఎక్స్ 100'కి మించిన హిట్ కావాలంటూ టీమ్ కి నాని బెస్ట్ విషెస్ తెలియజేశాడు. కార్తికేయ ఈ సినిమాలో ప్లే బాయ్ లా కనిపించనున్నాడనే విషయం, ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళంలోను ఈ వేసవిలో విడుదల చేయనున్నారు. ఈ రెండు భాషల్లోను కార్తికేయ ఒకేసారి హిట్ కొడతాడేమో చూడాలి

More Telugu News