Hyderabad: ఈ దొంగ ఎంబీఏలో గోల్డ్‌ మెడలిస్టు... పోలీసులకు చిక్కిన కేటుగాడు!

  • హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ
  • ఇళ్లలో చోరీలకు పాల్పడడమే వృత్తి
  • వలవేసి పట్టుకున్న సైబరాబాద్‌ పోలీసులు

ఎంబీఏలో గోల్డ్‌ మెడలిస్టు. అదీ ముఖ్యమైన హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో. ఏ కంపెనీలోనైనా చేరి ప్రతిభ చాటుకుంటే కనీసం నెలకు లక్ష రూపాయల వేతనం సంపాదించుకోవచ్చు. కానీ తన తెలివి తేటల్ని దొంగతనాలకు వినియోగించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. అధికారులే విస్తుపోయిన ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

 సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో గత కొన్నాళ్లుగా ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ఈ విధంగా 38 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. వలవేసి ఓ కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 800 గ్రాముల బంగారం, లక్షా యాభైవేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విచారణలో నిందితుడి గురించి తెలుసుకుని పోలీసులే నోళ్లు వెళ్ళబెట్టారు. నిందితుడు హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. పైగా గోల్డ్‌మెడల్‌ కూడా సాధించాడు. మరి ఉద్యోగం వదిలేసి దొంగతనాలను ఎంచుకున్నాడెందుకో! 

More Telugu News