Telangana: తెలంగాణ కేబినెట్ లోకి కవిత.. నిజామాబాద్ నుంచి అల్లుడు అనిల్ పోటీ!

  • నేడు టీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ
  • లోక్ సభ సిట్టింగ్ లను మార్చనున్న సీఎం
  • రేపు రెండో జాబితాను ప్రకటించే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారా? ఇప్పటివరకూ నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలిగా ఉన్న ఆమెను తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అంటే విశ్వసనీయవర్గాలు అవుననే జవాబు ఇస్తున్నాయి. కల్వకుంట్ల కవితను తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

కవితకు బదులుగా నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ నేత, అల్లుడు అనిల్  పోటీ చేస్తారని వెల్లడించాయి. ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో ప్రగతిభవన్ లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రేపు ప్రకటించనున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాను ఖరారు చేయనున్నారు.

ఈ సమావేశంలోనే ప్రస్తుత సిట్టింగ్ లోక్ సభ సభ్యులను మార్చాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కవితను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా? లేక ఎమ్మెల్సీగా రంగంలోకి దించుతారా? అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

More Telugu News