Andhra Pradesh: మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులకు నమ్మకం లేదు!: విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • అందుకే ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు
  • ఓడిపోతే మండలి సభ్యుడిగా కొనసాగుతాడన్నమాట
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై వైసీసీ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మంగళగిరి నుంచి గెలుస్తామన్న నమ్మకం చంద్రబాబు, లోకేశ్ కు లేదని ఎద్దేవా చేశారు. అందుకే శాసనమండలి సభ్యుడిగా రాజీనామా చేయకుండానే లోకేశ్ ను పోటీచేయిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే లోకేష్‌ను పోటీ చేయిస్తున్నారు. మంగళగిరిలో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నమాట. నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రిజైన్ చేయించలేదు చంద్రబాబూ?’ అని ప్రశ్నించారు. టీడీపీ తరఫున మంగళగిరి అభ్యర్థిగా నారా లోకేశ్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News