Karnataka: టీ మాత్రం తాగండి - రాజకీయాలు మాత్రం మాట్లాడొద్దు: బోర్డు పెట్టిన టీ స్టాల్ యజమాని

  • కర్ణాటకలోని మాండ్యాలో టీ స్టాల్
  • సుమలత, నిఖిల్ ఫ్యాన్స్ గొడవ పడతారు
  • రాజకీయాలు వద్దంటున్న యజమాని

పొద్దున్నే బిజీగా కనిపించేవి టీ స్టాళ్లు... పట్టణాల్లో కాదుగానీ, పల్లెల్లో అయితే, తెల్లారగానే టీ స్టాల్ వద్దకు వచ్చి, అక్కడ ఉండే పేపర్ చదువుతూ, తాజా రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ కాసేపు సమయాన్ని గడిపేవారు ఎంతో మంది ఉంటారు. అయితే, ఈ టీ స్టాల్ మాత్రం ప్రత్యేకం. ఇక్కడ రాజకీయాల గురించి ఎవరూ మాట్లాడకూడదు. అదే విషయాన్ని స్టాల్ యజమాని ఓ బోర్డు ద్వారా కస్టమర్లకు చెబుతున్నాడు.

తన టీ స్టాల్ లో దయచేసి రాజకీయ విషయాలు మాట్లాడవద్దని, కాఫీ, టీ తాగి క్షేమంగా వెళ్లి రావాలని ఆయన కోరుతున్నారు. ఈ వినూత్న టీ స్టాల్ కర్ణాటకలోని మాండ్యాలో ఉంది. వడిరాజ కాఫీ సెంటర్ గా దీన్ని పిలుస్తారు. ఈ స్టాల్ కు సినీ నటులు సుమలత, నిఖిల్ గౌడ్ అభిమానులు వచ్చి టీ తాగి వెళుతుంటారు. వారు గొడవలు పడిన సందర్భాలు, వారిని విడిపించిన సందర్భాలు ఉన్నాయని అంటాడు స్టాల్ యజమాని. ఎన్నికల వేళ రాజకీయాలు మాట్లాడుతుంటే మరిన్ని గొడవలు వస్తాయన్న ఉద్దేశంతోనే తాను ఈ బోర్డు పెట్టినట్టు చెబుతున్నాడు స్టాల్ యజమాని.

More Telugu News