Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హిందీ చిత్రం పూర్తి చేసిన రకుల్ 
  • 'మన్మథుడు 2'కి సంగీత దర్శకుడు ఖరారు 
  • 'వెంకీమామ'కు మరో షెడ్యూలు 

*  అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న హిందీ చిత్రం 'మార్జవాన్' షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో మరింత నాజూగ్గా కనిపించడం కోసం రకుల్ బరువు కూడా బాగా తగ్గింది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించాడు.
*  నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'ఆర్ఎక్స్ 100' ఫేం చింతన్ భరద్వాజ్ ను ఎంచుకున్నారు.
*  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా రూపొందుతున్న 'వెంకీమామ' చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, చైతూ పక్కన రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

More Telugu News