nizamabad: మేమంతా హిందువులం కాదా? గుళ్లకు పోవట్లేదా? గుండ్లు కొట్టించుకోవట్లేదా?: సీఎం కేసీఆర్

  • బీజేపీ వాళ్లు చెబితేనే మేము గుళ్లకు పోతున్నామా?
  • వాళ్లు చెబితేనే దేవుడికి దండం పెడుతున్నామా?
  • ఇతర మతాలను తిట్టే వాడే హిందువా?

బీజేపీ నేతలు మాట మాట్లాడితే ‘హిందువు’ అంటూ వ్యాఖ్యలు చేస్తారని, తామంతా హిందువులం కాదా? గుళ్లకు పోవట్లేదా? గుండ్లు కొట్టించుకోవట్లేదా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పిల్లలు పుట్టిన తర్వాత వేడుకలు చేసుకోవడం లేదా? పెరిగిన పోరగాళ్లకు పెళ్లిళ్లు చేయడం లేదా? చస్తే తద్దినాలు పెట్టుకోవట్లేదా? బీజేపీ వాళ్లు చెబితేనే తాము గుళ్లకు పోతున్నామా అంటూ నిప్పులు చెరిగారు.
ప్రతి ఇంట్లో కనీసం దేవుడి క్యాలెండర్ అయినా ఉంటుంది, నిద్ర లేవగానే దండం పెడతామని, బీజేపీ వాళ్లు చెబితేనే దండం పెడుతున్నామా? అని ప్రశ్నించారు. అంటే, ఇతర మతాలను తిట్టే వాడే హిందువు అనే పద్ధతిలో బీజేపీ వాళ్లు చెబతుతున్నారని విమర్శించారు. అందరినీ ప్రేమించమని, గౌరవించమని హిందూమతం చెప్పిందని అన్నారు. 

More Telugu News