CEO Dwivedi: 8.026 కిలోల బంగారం, రూ.23 కోట్లకు పైగా నగదు, 22 కిలోల వెండి స్వాధీనం: సీఈవో ద్వివేది

  • రూ.6 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు పట్టుబడ్డాయి
  • డీజీపీని మార్చాలంటూ ఫిర్యాదులు అందాయి
  • అభ్యంతరకర మెసేజ్‌లపై 89 నోటీసులు జారీ చేశాం

ఎన్నికలలో నిఘా, తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించామని.. వారు చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు, బంగారం పట్టుబడిందని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరులో రూ.6కోట్ల విలువైన బంగారం, వజ్రాలు పట్టుబడ్డాయని, ఈ విషయమై ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.

అవికాక రాష్ట్రంలో 8.026 కిలోల బంగారం, రూ.23 కోట్లకు పైగా నగదు, 22 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. డీజీపీని మార్చాలంటూ తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్య తీసుకుంటామన్నారు. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అభ్యంతరకర మెసేజ్‌లపై ఆయా పార్టీలకు 89 నోటీసులు జారీ చేశామని ద్వివేది తెలిపారు.

More Telugu News