Mahesh Babu: దేశభక్తుడిగా కనిపించనున్న మహేశ్ బాబు?

  • ముగింపు దశలో 'మహర్షి'
  • మే 9వ తేదీన విడుదల
  •  మిలటరీ అధికారిగా మహేశ్         

మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమా, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు ఎలా కనిపించనున్నాడు? అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమాలో మహేశ్ బాబు దేశభక్తుడిగా కనిపించనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. మిలటరీ అధికారిగా పనిచేసే హీరో .. సెలవులకి తన ఊరికి వచ్చిన దగ్గర నుంచి కథ మొదలవుతుందని అంటున్నారు. అనిల్ రావిపూడి తరహా వినోదంతో పాటు, దేశభక్తి పాళ్లు కూడా వుంటాయని చెబుతున్నారు. ఒక వైపున రాజమౌళి సినిమాలో  చరణ్ .. ఎన్టీఆర్ దేశభక్తులుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, మహేశ్ బాబు కూడా దేశభక్తుడిగానే కనిపించనున్నాడన్న మాట.

More Telugu News