trisha: త్రిషను వెతుక్కుంటూ వచ్చిన భారీ ఛాన్స్?

  • హిందీలో హిట్ కొట్టిన 'బద్లా'
  • తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ 
  • త్రిషను ఖరారు చేసే ఛాన్స్  

అమితాబ్ .. తాప్సీ ప్రధానమైన పాత్రధారులుగా రూపొందిన 'బద్లా' సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి నిర్మాత ధనుంజయ్ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.

తనకి తెలియకుండా ఒక హత్య కేసులో చిక్కుకున్న తాప్సీని కాపాడటానికి ఒక లాయర్ గా అమితాబ్ రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. తాప్సీ పాత్ర కోసం త్రిషను తీసుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని అంటున్నారు. ఇటీవల '96' హిట్ తో త్రిష క్రేజ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందువల్లనే ఈ పాత్ర కోసం ఆమెను ఎంచుకున్నారని చెబుతున్నారు. త్రిష ఎంపిక దాదాపు ఖరారైపోతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News