pawan kalyan: పవన్ పోటీ చేస్తున్న రెండు స్థానాలు ఇవే... ఖరారు చేసిన జనసేన

  • భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ
  • అధికారికంగా ప్రకటించిన జనసేన
  • నామినేషన్ దాఖలు చేసే తేదీపై ఈ సాయంత్రం లేదా రేపు ప్రకటన

రానున్న ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్టణం జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన నుంచి ప్రకటన వెలువడింది. నామినేషన్ దాఖలు చేసే రోజును ఈ సాయంత్రం లేదా రేపు ప్రకటిస్తారని తెలిపింది.

పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో జనసేన జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అనంతపురం, తిరుపతి, రాజానగరం, భీమవరం, పిఠాపురం, పెందుర్తి, గాజువాక, ఇచ్ఛాపురంలు అగ్రస్థానంలో నిలిచాయి. ఈ ఎనిమిది స్థానాలపై జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు అంతర్గత సర్వేను నిర్వహించారు. అనంతరం భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేయాలని పవన్ కు సూచించారు. వారి సూచన మేరకు ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు.

More Telugu News