chaina: ప్రపంచానికి ఉగ్రవాదంతో పెనుసవాల్‌... ముంబయి పేలుళ్లు ఘోరమైన చర్య: చైనా

  • జియాన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల ఏరివేతపై శ్వేతపత్రం విడుదల
  • శాంతికి, అభివృద్ధికి ఉగ్రచర్యలతో ఆటంకం అని వ్యాఖ్యలు
  • చైనా సానుకూల స్పందనతో మసూద్‌ విషయంలో ఆశలు

ఉగ్రవాదం ప్రపంచానికే పెనుసవాల్‌ అని చైనా వ్యాఖ్యానించింది. శాంతికి, అభివృద్ధికి ఉగ్ర చర్యలు ఆటంకం అని అంది. 2008లో భారత్‌లోని ముంబయి నగరంలో జరిగిన ఉగ్రదాడులు ఘోరమైన చర్యని పేర్కొంది. ప్రపంచంలో జరిగిన అత్యంత క్రూరమైన దాడుల్లో ఇది ఒకటని అంది. చైనాలోని జియాన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల ఏరివేతపై శ్వేతపత్రం విడుదల చేసిన చైనా భారత్‌ విషయంలో సానుకూలంగా ప్రకటనలు చేయడంతో మసూద్‌ అజర్‌ విషయంలో ఆశలు రేకెత్తుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకుని భారత్‌పై ఉగ్ర యుద్ధం చేస్తున్న మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ ఎప్పటి నుంచో కోరుతోంది.

ఇటీవల పుల్వామా దాడులు, ఆ తర్వాత పరిణామాల నేపధ్యంలో కూడా భారత్‌ ఇదే ప్రతిపాదనను ఐరాస భద్రతా మండలిలో పెట్టింది. అయితే అన్ని దేశాలు అంగీకరిస్తున్నప్పటికీ, వీటో అధికారం ఉన్న చైనా పదేపదే దీన్ని అడ్డుకుంటోంది. గత నెలలో ప్రతిపాదనను కూడా ఐరాసలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు అంగీకరించగా ఒక్క చైనా మాత్రమే వ్యతిరేకించింది. ఇది జరిగిన కొద్దిరోజులకే డ్రాగన్‌ ఉగ్రవాదంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశలు రేకెత్తిస్తోంది. 

More Telugu News