vaishnav tej: వైష్ణవ్ తేజ్ మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి

  • హీరోగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ
  • షూటింగు దశలో సినిమా 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా  

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. జాలరుల కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో వైష్ణవ తేజ్ కనిపించనున్నాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ విషయంలో తాజాగా విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయనను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన విలన్ పాత్రకి విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతాడనీ, ఈ సినిమాతో .. ఈ తరహా పాత్రలతో తెలుగులోనూ ఆయన బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News