Narendra Modi: మోదీ అసమర్థుడు... ‘నమర్ద్‌’ : ప్రధానిపై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఆయనో చేతకాని, అబద్ధాల కోరు
  • ఆయన పెళ్లి చేసుకోగలడు...పిల్లల్ని కనలేడు
  • గతంలోనూ కాంగ్రెస్‌ నేతల అభ్యంతరకర విమర్శలు

కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణి నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నారాయణరావు ప్రధాని మోదీపై నోరు పారేసుకున్నాడు. ఆయనో అసమర్థుడని, అబద్ధాల ప్రధాని అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘మోదీ పెళ్లి చేసుకోగలడు...కానీ పిల్లల్ని కనలేడు... మా భాషలో ఇటువంటి వారిని ‘నమర్ద్‌’ అంటాం’ అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News