Mahesh Babu: మహేశ్ బాబు 26వ సినిమాకి రంగం సిద్ధం

  • మే 9వ తేదీన 'మహర్షి' విడుదల
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
  •  వచ్చేనెలలో లాంచ్ చేసే అవకాశం

ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇదే విషయాన్ని గురించి తాజాగా అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

తాను దర్శకత్వం వహించే 5వ సినిమాకి సంబంధించిన కథకి తుది మెరుగులు దిద్దుతున్నాననీ, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందని ఆయన ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు 26వ సినిమాకి సంబంధించిన రంగం సిద్ధమైందంటూ ఆయన ఇలా హింట్ ఇచ్చాడు. బహుశా వచ్చే నెలలో ఈ సినిమాను లాంచ్ చేసి, 'మహర్షి' విడుదలైన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని అనుకోవచ్చు. ఈ సినిమా కోసం ఇద్దరు కథానాయికలు అవసరమవుతారట. ఒక కథానాయికగా రష్మిక మందన పేరు వినిపిస్తోంది. 

More Telugu News