Holy: హోలీ ఎఫెక్ట్: రేపటి నుంచి 22 వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్

  • ఆదేశాలు జారీ చేసిన సీపీ అంజనీ కుమార్ 
  • వాహనాలపై గుంపులుగా ప్రయాణించవద్దు
  • రోడ్డుపై హంగామాలు వద్దు

రంగుల పండుగ హోలీ సందర్భంగా బుధవారం నుంచి ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అంటే మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగర ప్రజలు హోలీని ఆనందంగా జరుపుకోవాలని కోరిన ఆయన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి మూడు రోజులపాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోలీ జరుపుకోవాలని, గుంపులుగా వాహనాలపై ప్రయాణించవద్దని, వాహనాలపై వెళ్తున్న వారిపై రంగులు చల్లరాదని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.  

More Telugu News