nagachaitanya: 'మజిలీ' నుంచి మనసు దోచే పాట

  •  చైతూ హీరోగా 'మజిలీ' 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్
  •  ఏప్రిల్ 5వ తేదీన విడుదల  

శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా రూపొందింది. చైతూ .. సమంత జంటగా నటించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమైంది. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగం పెంచారు.

షైన్ స్క్రీన్స్ వారు నిర్మించిన ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "యేడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారే లేదే .. నీ తోడు కోయిలే పొద్దుగూకే వేళ కూయలేదే .." అంటూ ఈ పాట సాగుతోంది. గోపిసుందర్ సంగీతం .. శివ నిర్వాణ సాహిత్యం .. కాలభైరవ - నిఖిత గాంధీ ఆలాపన బాగున్నాయి. దివ్యాంశ కౌశిక్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి

More Telugu News