up: యూపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి?: ఇండియాటుడే తాజా సర్వే

  • 80 స్థానాలలో ఎస్పీ, బీఎస్పీ 40 సీట్లను గెలుచుకునే అవకాశం
  • 35 స్థానాలు బీజేపీ ఖాతాలోకి
  • కాంగ్రెస్ ఐదు స్థానాలకు పరిమితం

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి అధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే తన తాజా సర్వేలో వెల్లడించింది. యూపీలోని మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ 40 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. గత ఎన్నికల్లో 71 స్థానాలను గెలుచుకున్న బీజేపీ... ఈ ఎన్నికల్లో కేవలం 35 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. గత ఎన్నికల కంటే ఇది 36 సీట్లు తక్కువ. మిగిలిన ఐదు స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్, ఒక స్థానాన్ని ఆర్ఎల్డీ గెలుచుకుంటాయని తెలిపింది.

మరోవైపు గత సర్వేతో పోల్చితే ప్రధాని అభ్యర్థిగా మోదీ మోదీ పాప్యులారిటి మరింత పెరిగిందని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో మోదీ ప్రధాని కావాలని 51 శాతం మంది ప్రజలు కోరుకోగా... తాజాగా ఆయన ప్రధాని కావాలని 55 శాతం మంది కోరుకుంటున్నారని తెలిపింది.

గత ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్, ఎస్పీలు కలసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ 7 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ రెండు (సోనియా, రాహుల్) స్థానాలు గెలిచాయి. ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ఒక స్థానంలో కూడా గెలవలేకపోయింది.

More Telugu News