surya: 'కాప్పన్'లో తీవ్రవాదిగా కనిపించనున్న ఆర్య

  • కేవీ ఆనంద్ నుంచి 'కాప్పన్'
  • ప్రధానమంత్రిగా మోహన్ లాల్ 
  • సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో సూర్య

జయాపజయాల సంగతి అటుంచితే ఎక్కడా గ్యాపు లేకుండా సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'రంగం' ఫేమ్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పన్' రూపొందుతోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధానమంత్రిగా కనిపించనుండగా, ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో సూర్య కనిపించనున్నాడు.

ఈ సినిమాలో ఆర్య కూడా కీలకమైన రోల్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆయన పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలో తలెత్తింది. ఈ సినిమాలో ఆయన ప్రధానమంత్రిని హత్య చేయడానికి రంగంలోకి దిగిన ఒక తీవ్రవాదిగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. కేవీ ఆనంద్ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడనీ, ఆర్య కెరియర్లో ఈ పాత్ర చెప్పుకోదగినది అవుతుందని అంటున్నారు. 'ఎన్జీకే' తరువాత ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. 

More Telugu News