chandrababu: ప్రభాకర్ రెడ్డిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది: చంద్రబాబు

  • పార్టీలు మారే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలి
  • 11 కేసుల్లో ముద్దాయిలు ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారు
  • దొంగలకు మోదీ కాపలాదారుడిగా ఉన్నారు

ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. టికెట్ ఇచ్చి గౌరవిస్తే, పార్టీ ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డిని చూస్తుంటే అసహ్యం వేస్తోందని అన్నారు. స్వార్థం కోసం పార్టీలు మారే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీలో సంఘవిద్రోహశక్తులు ఉన్నాయని అన్నారు. 11 కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఉన్నవారు ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని విమర్శించారు.

టీడీపీ కార్యాలయంలోనే పరిటాల రవిని హత్య చేసిన సంస్కృతి వారిదని చంద్రబాబు అన్నారు. బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఇక్కడ అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. వివేకా హత్యను టీడీపీపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దొంగలకు ప్రధాని మోదీ కాపలాదారుడిగా ఉన్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రం తెలంగాణ కంటే ఏపీలో సంక్షేమ పథకాలు ఎక్కువగా జరిగాయని చెప్పారు.

More Telugu News