gopichand: యాక్షన్ కామెడీతో రంగంలోకి గోపీచంద్

  • యాక్షన్ కామెడీతో గోపీచంద్
  • దర్శకుడిగా సంపత్ నంది  
  • వచ్చేనెల నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు

మొదటి నుంచి కూడా గోపీచంద్ ఎమోషన్ తో కూడిన యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. ఆ మధ్య మాత్రం కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా 'లౌక్యం' సినిమా చేశాడు. ఆ సినిమా ఆయనకి భారీ విజయాన్ని అందించింది. ఆ తరువాత మళ్లీ ఎప్పటిలానే యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న గోపీచంద్ దరిదాపుల్లోకి విజయమనేది రాలేదు. దాంతో ఆయన సరైన హిట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు సంపత్ నంది ఆయనకి ఒక కథను వినిపించడం, కామెడీతో కూడిన ఎంటర్టైనర్ కావడంతో ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. వచ్చేనెల నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ 'గౌతమ్ నంద' పరాజయం పాలైంది. అయినా యాక్షన్ కామెడీపై నమ్మకంతో ఈ ఇద్దరూ మళ్లీ రంగంలోకి దిగుతున్నట్టుగా సమాచారం. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News