raviteja: రవితేజను సెట్ చేసిన వినాయక్?

  • వీఐ ఆనంద్ తో 'డిస్కోరాజా'
  • తదుపరి సినిమా సంతోష్ శ్రీనివాస్ తో 
  • కొత్త ప్రాజెక్టు వివరాలు త్వరలో    

ప్రస్తుతం రవితేజ .. వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన వినాయక్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'ఇంటిలిజెంట్' తరువాత వినాయక్ వేరే ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు.

బాలకృష్ణతో అనుకున్నప్పటికీ అది కూడా వెనక్కిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన రవితేజకి ఒక కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని టాక్. గతంలో తనకి 'కృష్ణ' సినిమాతో మంచి హిట్ ఇచ్చిన కారణంగా రవితేజ మరో ఆలోచన చేయలేదని అంటున్నారు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News