Andhra Pradesh: జగన్ లోటస్ పాండ్ లో ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు

  • కేసీఆర్ తో జగన్ లాలూచీ పడ్డారు
  • ఏపీకి ద్రోహం చేసే పార్టీలు మనకు కావాలా?
  • కేసీఆర్ కాళ్లు మొక్కడానికి జగన్ సిద్ధపడ్డారు

ఏపీకి అన్యాయం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో వైసీపీ అధినేత జగన్ లాలూచీ పడ్డారని, ఇలా ద్రోహం చేసే పార్టీలు మనకు కావాలా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కాకినాడలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కాళ్లు మొక్కడానికి సిద్ధపడ్డ జగన్ లోటస్ పాండ్ లో ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఓటు దొంగలు రాష్ట్రంలో చొరబడ్డారని, ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గోదావరి జిల్లాలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని, తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కాపు రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీకి కాపు కులస్తులు ఓటు ఎందుకు వేయాలి? అని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. మంచివాళ్లకు మారుపేరు తూర్పుగోదావరి జిల్లా అని, ప్రశాంతమైన చోట పులివెందుల రాజకీయాలు మనకు వద్దని ప్రజలకు సూచించారు.

More Telugu News