Andhra Pradesh: రొమాన్స్ ఇన్ యాక్షన్.. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ టీజర్ విడుదల!

  • ట్విట్టర్ లో విడుదల చేసిన విజయ్
  • దేవరకొండకు జోడీగా రష్మిక మందన
  • గీతగోవిందం హిట్ తో భారీగా పెరిగిన అంచనాలు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ ఈరోజు రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా మాస్ లుక్ తో అదరగొట్టేశాడు. కాగా, డియర్ కామ్రేడ్ లో విజయ్ కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది.

మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై భరత్ కమ్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కాగా, విజయ్-రష్మిక జోడీ ‘గీతగోవిందం’ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తుందని చిత్ర యూనిట్ గంపెడు ఆశలతో ఉంది. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.

More Telugu News