Telugudesam: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను పట్టుకుని తీరతాం: బుద్ధా వెంకన్న

  • సీబీఐ కేసుల్లో ఇరికించారని జగన్ మొత్తుకున్నారు
  • ఇప్పుడేమో, అదే సీబీఐతో విచారణ జరిపించాలంటారు
  • జగన్-మోదీల లాలూచీ రాజకీయాలు ఇవి

మొన్నటి వరకూ తనను సీబీఐ కేసుల్లో ఇరికించారని మొత్తుకున్న జగన్, ఈరోజు అదే సీబీఐతో విచారణ జరిపించాలంటున్నారని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్-మోదీ ల మధ్య లాలూచీ రాజకీయాలు ఉన్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకా ఏం కావాలని ప్రశ్నించారు.

ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉంది కనుక, వైఎస్ వివేకా హత్య కేసులో దోషులను తాము పట్టుకుని తీరతామని స్పష్టం చేశారు. అసలు, జమ్మలమడుగులో వైఎస్ వివేకానందరెడ్డి ప్రచారం చేయడమేంటి? కడప, జమ్మలమడుగు, పులివెందుల.. ఎక్కడి నుంచైనా వివేకాను పోటీ చేయమని ఆయనకు సీటిచ్చారా? ఆయనపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతోందని ఎద్దేవా చేశారు. విశాఖపట్టణంలో జగన్ పై జరిగిన దాడి కేసును, గుంటూరు జిల్లా కొండవీడు కోట ఉత్సవాల సమయంలో ఇటీవల ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే, దాన్ని మర్డర్ గా చిత్రీకరించే యత్నం చేశారని, ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే జగన్ చూస్తారని విమర్శించారు.

More Telugu News