vijay devarakonda: రేపు రిలీజ్ కానున్న 'డియర్ కామ్రేడ్' టీజర్

  • స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ
  • క్రికెటర్ గా రష్మిక మందన 
  • మే చివరివారంలో విడుదల

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'డియర్ కామ్రేడ్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ .. బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన నటించింది. స్టూడెంట్ లీడర్ పాత్రలో విజయ్ దేవరకొండ .. క్రికెటర్ పాత్రలో రష్మిక కనిపించనున్నారు. 'గీత గోవిందం' కాంబినేషన్ కావడంతో సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో వున్నాయి.

ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని విజయ్ దేవరకొండ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రేపు (మార్చి 17) ఉదయం 11గంటల 11 నిమిషాలకి ఈ సినిమా నుంచి టీజర్ వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. తెలుగుతో పాటు తమిళ.. మలయాళ .. కన్నడ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అందువలన ఆ భాషల్లోను టీజర్ ను విడుదల చేస్తున్నారు. మే చివరివారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News