kalyan ram: '118' సినిమాకి నివేద వెన్నెముక .. షాలినీ పాండే ప్రత్యేక ఆకర్షణ

  • నా నమ్మకం నిజమైంది 
  • ఆ పాత్రలో మరొకరిని ఊహించడం కష్టం 
  • ప్రేక్షకులకు ధన్యవాదాలు

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా .. గుహన్ దర్శకత్వంలో '118' సినిమా తెరకెక్కింది. నివేదా థామస్ .. షాలినీ పాండే ఈ సినిమాలో నాయికలుగా మెప్పించారు. ఈ నెల 1వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి రోజు నుంచి కూడా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్, ఈ రోజున (మార్చి 16) హైదరాబాద్ లోని 'ఆవాసా' హోటల్లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

కల్యాణ్ రామ్ .. నివేదా.. షాలినీ తో పాటు దర్శక నిర్మాతలు .. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "కొత్త కాన్సెప్ట్ కి ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా వుంటుందనే నమ్మకంతో ఈ సినిమా చేశాను .. నా నమ్మకం నిజమైంది. ఈ సినిమాకి నివేదా థామస్ వెన్నెముక అనే చెప్పాలి. ఆమె కాకుండా ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమే. ఇక ఈ సినిమాకి షాలినీ పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని అన్నారు.

More Telugu News