vishal: 'టెంపర్' తమిళ రీమేక్ విడుదల వాయిదా

  • విశాల్ హీరోగా రూపొందుతోన్న 'అయోగ్య'
  • పాట చిత్రీకరణలో గాయపడిన విశాల్ 
  • మే 10వ తేదీకి భారీ విడుదల    

విశాల్ కథానాయకుడిగా తమిళంలో 'అయోగ్య' రూపొందుతోంది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్'కి ఇది రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా రాశీ ఖన్నా అలరించనుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం.

ఇటీవల ఒక పాటను చిత్రీకరిస్తుండగా విశాల్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. విశాల్ విశ్రాంతి తీసుకోవలసి రావడంతో షూటింగుకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ముందుగా అనుకున్న సమయానికి షూటింగు పూర్తిచేయలేకపోతున్నందు వలన విడుదల తేదీని వాయిదా వేశారు. మే 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఏప్రిల్ 19న లారెన్స్ 'కాంచన 3' వస్తుండటం కూడా విశాల్ సినిమా విడుదల తేదీ మారడానికి మరో కారణమనే టాక్ కూడా వినిపిస్తోంది.

More Telugu News