Catherin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రవితేజ సరసన కేథరిన్ 
  • హైకోర్టులో చిన్మయికి ఊరట
  • వెండితెరకు వస్తున్న కొత్తజంట 

*  రవితేజ సరసన కేథరిన్ త్రెసా కథానాయికగా నటించనుంది. 'తెరి' తమిళ చిత్రాన్ని రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో నాయిక పాత్రకు తాజాగా కేథరిన్ ను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి 'కనకదుర్గ' అనే పేరును నిర్ణయిస్తున్నారు.
*  ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాదపై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. గతేడాది డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు రాధారవిపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేయడంతో ఆమెపై నిషేధం విధించారు.
*  తమిళ నటుడు ఆర్య, కథానాయిక సాయేశా సైగల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. పెళ్లి తర్వాత ఈ జంట వెండితెరపై మరోసారి జంటగా కనిపించనుంది. 'టెడ్డీ' చిత్రంలో ఆర్యకు జంటగా తాజాగా సాయేశాను ఎంపిక చేశారు. వీరిద్దరూ కలిసి నటించే మూడో చిత్రం ఇది.

More Telugu News