niharika: 'సూర్యకాంతం' సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • సంగీత దర్శకుడిగా మార్క్ కె. రాబిన్
  •  కృష్ణకాంత్ సాహిత్యం 
  • ఆకట్టుకుంటోన్న కార్తీక్ గానం  

నిహారిక ప్రధాన పాత్రధారిగా ప్రణీత్ దర్శకత్వంలో 'సూర్యకాంతం' చిత్రం నిర్మితమైంది. ఈ సినిమాలో నిహారిక జోడీగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వరుణ్ తేజ్ చేతులమీదుగా రిలీజ్ చేయించారు.

 "వద్దన్నా గుండెల్లో దాచే ప్రేమ .. ఎంతున్నా అర్థం వుందా .. నా దంటే నా దంటూ చూపే ప్రేమ ఏమైనా చేయిస్తుందా .. " అంటూ ఈ పాట సాగుతోంది. మార్క్ కె. రాబిన్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. కార్తీక్ గానం ఈ పాటకు ప్రాణం పోశాయి. యూత్ హృదయాలను పట్టుకునేలా ఈ పాట వుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రం తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నిహారిక వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News