Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. పొత్తు కుదుర్చుకున్న జనసేన-బీఎస్పీ!

  • లక్నోలో మాయావతితో పవన్ భేటీ
  • ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయం
  • సీట్ల కేటాయింపుపై క్లారిటీ ఇవ్వని బీఎస్సీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పొత్తుకు తెరలేచింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఈరోజు ప్రకటించారు. యూపీలోని లక్నోలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ తో కలిసి మాయావతి మాట్లాడారు. ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణీపై అంగీకారం కుదిరిందని మాయావతి తెలిపారు.

త్వరలోనే పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఏపీతో పాటు తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో కలిసి పోటీచేస్తామని అన్నారు. కాగా, ఈ పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లను బీఎస్పీకి కేటాయించిందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 32 మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్ సభ సభ్యులతో జనసేన తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.  

More Telugu News