iaf: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత.. గాలిలో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

  • పంజాబ్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో వాయుసేన అప్రమత్తం
  • నిన్న రాత్రి భారీ సంఖ్యలో గాల్లో ఎగిరిన యుద్ధ విమానాలు
  • ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ పాక్ కు హెచ్చరిక

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి పంజాబ్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పాక్ కు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఎక్సర్ సైజ్ లో భారీ సంఖ్యలో యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ విమానాలన్నీ సూపర్ సోనిక్ వేగంతో ఆకాశంలో దూసుకుపోయాయి.

బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ స్థావరాలపై దాడి చేసినప్పటి నుంచి మన వాయుసేన అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఏ క్షణంలోనైనా శత్రు దేశంపై దాడికి దిగేలా సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే సరిహద్దుల్లోని ఎయిర్ బేస్ లలో జెట్ ఫైటర్లు భారీ సంఖ్యలో మోహరించాయి. ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ లో ఉంది. రెండ్రోజుల క్రితం పాక్ కు చెందిన యుద్ధ విమానాలు సరిహద్దు వద్దకు చొచ్చుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో, భారత వాయుసేన పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.

More Telugu News