nagarjuna: సెట్స్ పైకి వెళ్లే దిశగా 'బంగార్రాజు'

  • జూన్ నుంచి సెట్స్ పైకి
  • భార్య పాత్రలో రమ్యకృష్ణ 
  • మనవడిగా కనిపించనున్న చైతూ  

నాగార్జున కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' భారీ విజయాన్ని అందుకుంది. నాగార్జున కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో 'బంగార్రాజు'గా ఆయన పోషించిన పాత్ర బాగా పాప్యులర్ అయింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అప్పటి నుంచి సీక్వెల్ చేయాలనే ఉద్దేశంతోనే నాగార్జున వున్నారు .. అది ఇప్పటికి కుదిరింది.

కల్యాణ్ కృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దుతున్నాడు. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బంగార్రాజు పాత్రకి భార్యగా రమ్యకృష్ణనే ఎంపిక చేస్తున్నారు. ఇక ఆయన మనవడిగా చైతూ కనిపించనున్నాడని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో, చైతూ సరసన నాయికగా ఎవరు కనిపించనున్నారనేది తెలియాల్సి వుంది. 

More Telugu News