Tamil Nadu: మనీల్యాండరింగ్‌ కేసులో మాజీ మంత్రి కొడుక్కి ఏడేళ్ల జైలు

  • నిందితుడు డీఎంకే మాజీ మంత్రి మణి తనయుడు
  • ఎటువంటి పత్రాల్లేకుండా విదేశీ సంస్థలకు రూ.78 కోట్లు
  • కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన ఈడీ

మనీల్యాండరింగ్‌ కేసులో తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రి కొడుక్కి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ చెన్నైలోని సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎటువంటి పత్రాలు, అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు రూ.78 కోట్లు తరలించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులో కోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది.

వివరాల్లోకి వెళితే... డీఎంకే ప్రభుత్వ హయాంలో కరుణానిధి మంత్రి వర్గంలో తిరువాన్మియూర్‌కు చెందిన దివంగత కె.సి.మణి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన కుమారుడు మణిఅన్బళగన్‌ థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలోని ఓ బ్యాంకు నుంచి ఎలాంటి పత్రాల్లేకుండా విదేశీ సంస్థకు రూ.78 కోట్లు పంపించారు. దీన్ని గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అప్పట్లో కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారించిన చెన్నై కోర్టు నిందితుడు మణిఅన్బళగన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు కోటి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 

More Telugu News