Andhra Pradesh: రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లున్న వారు 30 లక్షల మంది: ఏపీ సీఈఓ

  • రాజకీయ ఫిర్యాదు మేరకు ఈసీఐకి లేఖ రాసిన ద్వివేదీ
  • ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు
  • రెండు చోట్లా ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ఈసీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓటుహక్కు కలిగిన వారు ఏకంగా 30 లక్షల మంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) గోపాల్ కృష్ణ ద్వివేదీ తెలిపారు. ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దృష్టికి లేఖ ద్వారా ఆయన తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారు దాదాపు 30 లక్షల మంది వరకు ఉన్నారని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న ఒకేరోజు లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారు అక్కడ ఓటేసి ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే డూప్లికేట్ ఓట్ల విషయంపై ఈసీఐకి లేఖ రాసినట్టు ద్వివేదీ తెలిపారు. ఈసీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఆదేశాలు అందగానే రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారి ఓట్లను తొలగించనున్నట్టు తెలిపారు.

More Telugu News