Uttar Pradesh: టార్గెట్‌ 20... ఘోరంగా ఓడిపోతున్నా పోటీ చేయడమే అతని లక్ష్యం!

  • ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఫక్కడ్‌బాబా ప్రత్యేకత ఇది
  • ఇరవయ్యోసారి ఎన్నికల్లో గెలుస్తానని బాబా చెప్పారట
  • 1977 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు పోటీ

ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజం. సాధారణంగా గెలుపు అవకాశాలను ఊహించుకునే అభ్యర్థులు బరిలో దిగుతుంటారు. కానీ ఆయన రూటే సెపరేటు. తను ఓడిపోతానని తెలిసినా పట్టువదలని విక్రమార్కుడిలా గడచిన నభై ఏళ్లుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటునే ఉన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నారు. 20 సార్లు పోటీ తన లక్ష్యమని చెపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఫక్కడ్‌ బాబా (75) ప్రత్యేకత ఇది. ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆయన కచ్చితంగా బరిలో ఉంటారు.

1977లో జరిగిన ఎన్నికల్లో మధుర లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఆయన పోటీకి దిగారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోను, 2017లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఇప్పటికే 16 సార్లు ఘోరంగా ఓటమిపాలైనా తాజాగా జరగనున్న ఎన్నికల్లో మధుర నుంచి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ‘ఈసారి కూడా నేను ఓడిపోతాను. ఇరవయ్యోసారి పోటీ చేసినప్పుడు మాత్రమే గెలుస్తాను. నా గురువు నిశ్చలానందస్వామి మాట ఇది’ అని ఆయన ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. గో సంరక్షణే తన లక్ష్యమని, పేదల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

More Telugu News