mumbai: ముంబై మృతులకు రూ. 5 లక్షల పరిహారం: ప్రకటించిన ప్రభుత్వం

  • గత రాత్రి కుప్పకూలిన పాదచారుల వంతెన
  • నలుగురి మృతి.. 34 మందికి గాయాలు
  • క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారం.. పూర్తి వైద్య సేవలు

ముంబైలోని చత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో పాదచారుల వంతెన కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఫడ్నవిస్ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రకటించారు. అంతేకాదు, వారి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

గురువారం రాత్రి స్టేషన్‌లోని పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘనటతో స్టేషన్‌లో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్ బ్రిడ్జి కూలిన ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు.

More Telugu News