Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో చిత్రానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ 
  • 'మహర్షి'కి బ్రేక్ ఇస్తున్న మహేశ్ 
  • మలయాళంలో అఖిల్ 'హలో'
  • రవితేజ చిత్రానికి 'కనకదుర్గ' టైటిల్ 

*  ప్రస్తుతం 'సైలెన్స్' చిత్రంలో నటిస్తున్న అనుష్క తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పింది. అయ్యప్పస్వామి కథతో దక్షిణాది భాషల్లో సంతోష్ శివన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనుష్క కీలక పాత్ర పోషిస్తుందట.
*  ప్రస్తుతం 'మహర్షి' షూటింగులో వున్న మహేశ్ బాబు షూటింగుకి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నాడు. థమ్సప్ శీతల పానీయానికి ప్రచారకర్త అయిన మహేశ్ ఆ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికా వెళుతున్నాడు.
*  అఖిల్ అక్కినేని నటించిన రెండో చిత్రం 'హలో'ని అదే పేరుతో మలయాళంలోకి అనువదించారు. ఈ మలయాళ వెర్షన్ ని నేడు కేరళలో విడుదల చేస్తున్నారు. తెలుగులో అపజయం పాలైన ఈ చిత్రం అక్కడ ఎలా ఆడుతుందో చూడాలి!
*  తమిళంలో హిట్ అయిన 'తెరి' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి 'కనకదుర్గ' అనే టైటిల్ని నిర్ణయించారు.

More Telugu News