India: కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ.. బీజేపీలో చేరిన సోనియా ప్రధాన అనుచరుడు వడక్కన్!

  • జవాన్ల త్యాగాలను కాంగ్రెస్ కించపరుస్తోంది
  • జాతి వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది
  • అది తట్టుకోలేకే రాజీనామా సమర్పించాను

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి ప్రధాన అనుచరుడిగా 20 ఏళ్ల పాటు పనిచేసిన టామ్ వడక్కన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. జవాన్ల ధైర్య సాహసాలను కాంగ్రెస్ పార్టీ కించపరుస్తోందని టామ్ వడక్కన్ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధానాలతో తాను మనస్తాపానికి గురయ్యానని వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మన నేలపై దాడి చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిన ధోరణి నాకు నచ్చలేదు. ఏ పార్టీ అయినా దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి విధానాలు అనుసరిస్తే దాన్ని మనం ప్రోత్సహించకూడదు. నాకు వేరే దారి లేకపోవడంతో పార్టీని వీడుతున్నా’ అని తెలిపారు. వడక్కన్ కాంగ్రెస్ పార్టీలో వేర్వేరు హోదాల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు.

More Telugu News