United Nations Security Council: భారత్‌కు మరోమారు షాకిచ్చిన చైనా.. ఉగ్రవాది మసూద్ అజర్‌కే డ్రాగన్ కంట్రీ ఓటు

  • ఇప్పటికే మూడుసార్లు భారత్ విజ్ఞప్తికి మోకాలడ్డిన చైనా
  • పుల్వామా దాడి వెనక మసూద్ హస్తం
  • యూకే, యూఎస్, ఫ్రాన్స్ విజ్ఞప్తి బుట్టదాఖలు

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా (గ్లోబల్ టెర్రరిస్ట్)గా ప్రకటించాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చేసిన ప్రతిపాదనకు చైనా మరోమారు అడ్డుపుల్ల వేసింది. ఇప్పటికే భారత్ విజ్ఞప్తికి మూడుసార్లు అడ్డుతగిలిన చైనా తాజాగా నాలుగోసారి కూడా మోకాలడ్డింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా.. పాకిస్థాన్‌తో తనకున్న సంబంధాల నేపథ్యంలో భారత్‌కు ప్రతిసారి అడ్డంపడుతోంది.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా దాడి వెనక జైషే హస్తం ఉందని పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన భారత్ మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని ఐరాస భద్రతా మండలిని ఇటీవల కోరింది. దీంతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు దీనికి మద్దతుగా నిలిఛి ప్రతిపాదనను పెట్టాయి. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనని ప్రతిపాదించాయి. అయితే, చైనా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించుకుని భారత్ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ప్రతిపాదనను భద్రతా మండలి పక్కన పెట్టేసింది.

More Telugu News