Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాగార్జునకు థ్యాంక్స్ చెప్పిన అనుష్క 
  • సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్న రామ్  
  • నాని నాయికగా అదితీరావు 

*  అందాలతార అనుష్క సినిమాల్లోకి వచ్చి పద్నాలుగేళ్లు గడిచిందట. ఈ సందర్భంగా, 'సూపర్' సినిమా ద్వారా తనకు తొలి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన హీరో నాగార్జునకు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కు సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ థ్యాంక్స్ చెప్పింది.
*  రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, ఈ చిత్రంలో హీరో రామ్ సిక్స్ ప్యాక్ షేప్ లో కనపడడం కోసం ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నాడట.
*  నాని సరసన అదితీరావు హైదరి కథానాయికగా నటించనుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం అదితిని సంప్రదిస్తున్నారట.

More Telugu News