Cricket: సిరీస్ ఫలితం తేల్చే మ్యాచ్ లో ఓటమి దిశగా భారత్

  • లక్ష్యఛేదనలో విఫలమైన టాపార్డర్
  • నిరాశపర్చిన ధావన్, పంత్
  • రాణించని కోహ్లీ

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్డే ఏకపక్షంగా సాగుతోంది. ఢిల్లీ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిదిశగా పయనిస్తోంది. ఆసీస్ విసిరిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 32 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. భారత్ గెలవాలంటే 18 ఓవర్లలో 127 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్ క్రీజులో ఉన్నారు.

అంతకుముందు, టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (100) సెంచరీ సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 272 పరుగులు చేసింది పర్యాటక జట్టు. హ్యాండ్స్ కోంబ్ మరోసారి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడి 52 పరుగులు జతచేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, షమీ 2, జడేజా 2 వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్ లో ఇది చివరి మ్యాచ్. ఇరు జట్లు 2-2తో సిరీస్ లో సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.

More Telugu News