Andhra Pradesh: కేసీఆర్ కు జగన్ దత్తపుత్రుడిగా మారారు.. దోచుకోవడానికే పారిశ్రామికవేత్తలు వైసీపీలోకి వెళుతున్నారు!: బుద్ధా వెంకన్న

  • జగన్ ను కాపాడాలని సీబీఐకి మోదీ చెప్పారు
  • ఎంత ముడుపులు అందాయో మోదీ చెప్పాలి
  • ఫామ్-7 ద్వారా జగన్ ఓటు తొలగించారనడం అబద్ధం

వైసీపీ అధినేత జగన్ ను కాపాడాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి ప్రధాని మోదీ నుంచి ఆదేశాలు అందాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ అవినీతికి ఆయన కాపలాదారుగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జగన్ దత్తపుత్రుడిగా తయారయ్యారని దుయ్యబట్టారు. అమరావతితో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

పారిశ్రామికవేత్తలంతా దోచుకోవడానికే జగన్ పార్టీలోకి వెళుతున్నారని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. అసలు జగన్ నుంచి ఎంత ముడుపులు అందాయో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఓటును తొలగించేందుకు ఫామ్-7 ఇచ్చారన్నది అబద్ధమనీ, ఆయన పాస్ పోర్టులో అడ్రస్ ఏమని ఉందో చూడాలన్నారు.

అసలు జగన్ ను అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పులివెందులలో తన ఓటును తీసేయమని దరఖాస్తు చేశారని జగన్ అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News