YSRCP: వైసీపీలో ట్విస్ట్... అభ్యర్థుల తొలి జాబితా విడుదల నేడు కాదు!

  • 16న ఉదయం 10.26కు విడుదల
  • ఇడుపులపాయలోనే విడుదల చేయాలని జగన్ నిర్ణయం
  • అక్కడి నుంచే ప్రచార పర్వంలోకి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ పడే అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయబోవడం లేదు. ఈ ఉదయం పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి, తమ్మినేని సీతారాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, విజయసాయిరెడ్డి తదితరులతో సమావేశమైన వైఎస్ జగన్, దాదాపు గంట సేపు జాబితాకు తుదిరూపు నిచ్చేందుకు చర్చలు జరిపారు.

ఆపై ఈ నెల 16వ తేదీన ఉదయం 10.26 నిమిషాలకు తమ పార్టీ తొలి జాబితా విడుదలవుతుందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. జాబితాలో కొన్ని మార్పులు చేయాల్సి వున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇదే సమయంలో ఇడుపులపాయలోని మహానేత వైఎస్ స్మారకం పార్టీకి సెంటిమెంట్ గా ఉందని, అక్కడే జాబితాను విడుదల చేయాలని పలువురు నేతలు కోరడంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జాబితా విడుదల తరువాత, వెంటనే జగన్ ప్రచార పర్వాన్ని ప్రారంభిస్తారని సమాచారం.

More Telugu News